
బిగ్ బాస్ తెలుగు 10 లో రోహిత్ దూకుడు మీద సీజన్ 2 విన్నర్ కౌశల్ మండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇంకా ఏడు వారాలు కూడా పూర్తి కాకుండానే "బిగ్ బాస్ విన్నర్ నేనే, ట్రోఫీ నాదే, టైటిల్ తీసుకెళ్తా, మీతో చప్పట్లు కొట్టిస్తా" అంటూ రోహిత్ శపథాలు చేస్తున్నాడని, నేను సాధిస్తా అనడంలో తప్పు లేదు కానీ సాధించడానికి తగ్గ సాధన ఉండాలని కౌశల్ ఫైర్ అయ్యాడు.
బిగ్ బాస్ హౌస్ లో రోహిత్ గ్రాఫ్ చూస్తే ఒకప్పుడు ఆకాశం, ఇప్పుడు పాతాళం అన్నట్టు మారిందని కౌశల్ అన్నాడు. అహంకారం తలకెక్కితే జనం పాతాళానికి తొక్కేస్తారంటూ ఇన్ డైరెక్ట్ గా రోహిత్ గురించి చెప్పాడు.
అరిస్తే బిగ్ బాస్ విన్నర్లు అవ్వరు, ఆట ఆడితే అవుతారంటూ కౌశల్ కామెంట్స్ చేశాడు. గతంలో కూడా రోహిత్ బూతులు, "ఏం పీక్కుంటావో పీక్కో" అనే యాటిట్యూడ్ పై కౌశల్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ లేకపోతే నువ్వెవరికీ తెలియదు, నేను కూడా ఎవరికీ తెలియదు, ఇదంతా ఆయన పెట్టిన భిక్షే అంటూ గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని చెప్పాడు. ఈ సీజన్ లో అగ్నిపరీక్ష నుంచి వచ్చిన రోహిత్ కి మొదట్లో మంచి సపోర్ట్ ఉన్నా, ఇప్పుడు నెగెటివిటీ పెరుగుతుండటంతో కౌశల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.






